ఫ్యాక్ట్ చెక్: భారత్-పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల మధ్య తోపులాట జరిగిందనే వాదనలో ఎలాంటి నిజం లేదు

వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా..భారత్-పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల మధ్య తోపులాట

Update: 2026-01-11 12:14 GMT

మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా మొదలైంది. ఈ టోర్నమెంట్ లో పలు దేశాల మహిళల క్రికెటర్లు భాగమయ్యారు. అయితే పాకిస్థాన్ కు చెందిన ప్లేయర్లకు బీసీసీఐ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మ్యాచ్ సందర్భంగా భారత, పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు ఒకరినొకరు తోసుకున్నట్లుగా ఉంది. ఈ దృశ్యాలలో భారత ప్లేయర్ ను పాకిస్తాన్ జట్టు సభ్యురాలు నేలపైకి నెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు రెచ్చగొట్టారనే శీర్షికతో ఈ
వీడియో
షేర్ చేస్తున్నారు.
వీడియోలో వినిపించే వ్యాఖ్యానం ఈ వాదనను మరింత బలపరుస్తుంది. "బౌండరీ లైన్ దగ్గర ఘర్షణ జరిగింది, భారత ఫీల్డర్ ను పాకిస్తాన్ క్రీడాకారిణి భుజం పట్టుకుని కిందకు తోసింది. దీంతో భద్రతా సిబ్బంది లోపలికి దూసుకువచ్చారు." అంటూ చెప్పడం మనం వినవచ్చు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.



 


వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ విజువల్స్ భారత - పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల మధ్య మైదానంలో జరిగిన ఘర్షణను చూపిస్తున్నాయనే వాదన తప్పు. వీడియో AI-జనరేటెడ్ అని తేలింది.
వైరల్ క్లెయిమ్‌ను ధృవీకరించడానికి, మేము భారతదేశం - పాకిస్తాన్ మ్యాచ్‌ కు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేసాము. ఇటీవల భారతదేశం - పాకిస్తాన్ మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదని సెర్చ్‌లో వెల్లడైంది. రెండు జట్లు చివరిసారిగా 2025 ICC మహిళల ODI ప్రపంచ కప్ సమయంలో తలపడ్డాయి. ఆ టోర్నమెంట్ సమయంలో ఎటువంటి ఘర్షణ జరిగినట్లు విశ్వసనీయ నివేదికలు లేవు.
వైరల్ విజువల్స్‌ను నిశితంగా పరిశీలిస్తే అనేక స్పెల్లింగ్ లోపాలు, సాంకేతిక అసమానతలు, ముఖ్యంగా క్రీడాకారుల జెర్సీలపై ఉన్న పేర్లలో తేడాలు కనిపించాయి. Dream11 తర్వాత, అపోలో టైర్స్ సెప్టెంబర్ 2025 నుండి మార్చి 2028 వరకు రెండున్నర సంవత్సరాల పాటు భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా మారింది. స్పాన్సర్‌షిప్ ఒప్పందం ప్రకారం, అపోలో టైర్స్ లోగో అన్ని ఫార్మాట్లలోని భారత పురుషులు, మహిళల జాతీయ జట్ల జెర్సీలపై కనిపించాలి. వైరల్ వీడియోలో, భారత ఆటగాళ్ల జెర్సీపై బైజూస్ అనే పేరు కనిపిస్తుంది, అది కూడా తప్పుగా రాసి ఉంది. బైజూస్ భారత క్రికెట్ జట్టుకు అధికారిక స్పాన్సర్‌గా సెప్టెంబర్ 2019 మరియు 2023 మధ్య మాత్రమే ఉంది.



 



పాకిస్తాన్ జట్టు జెర్సీపై మరిన్ని వ్యత్యాసాలు కనిపించాయి. “పాకిస్తాన్” అనే పదంలో స్పెల్లింగ్ లోపాలు ఉన్నాయ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) లోగో తప్పుగా ఉంది. అదనంగా, పాకిస్తాన్ క్రీడాకారిణి పడిపోయినట్లు కనిపించిన ఖచ్చితమైన సమయంలో, ఆమె కాలు దగ్గర అకస్మాత్తుగా ఆకుపచ్చ హెల్మెట్ కనిపిస్తుంది, ఇది విజువల్స్ AI-జనరేట్ అని తెలుపుతోంది.



 


ఈ ఫలితాలను నిర్ధారించడానికి, సాధారణంగా ఉపయోగించే AI-డిటెక్షన్ సాధనం అయిన హైవ్ మోడరేషన్ ఉపయోగించి వీడియోను విశ్లేషించారు. వీడియోలోని చాలా భాగాలు AI-జనరేట్ చేయబడినవని విశ్లేషణలో వెల్లడైంది.



 


భారత- పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల మధ్య మైదానంలో ఘర్షణ జరిగిందని వైరల్ అవుతున్న విజువల్స్ ప్రామాణికమైనవి కావు. వైరల్ వీడియో కృత్రిమ మేధస్సును ఉపయోగించి సృష్టించారు.


Claim :  వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News