MARCH 13 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రాశ్యాధిపతైన కుజుడు అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. దాదాపు అనుకూల ఫలితాలుంటాయి.

Update: 2023-03-12 23:30 GMT

march 13th horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, సోమవారం

తిథి : బ.షష్ఠి రా.9.27 వరకు
నక్షత్రం : విశాఖ ఉ.8.21 వరకు
వర్జ్యం : మ.12.20 నుండి 1.55 వరకు
దుర్ముహూర్తం : మ.12.41 నుండి 1.28 వరకు, మ.3.03 నుండి 3.51 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.30 నుండి 6.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుంచి కుజుడి సంచారం మారుతుంది. కష్టనష్టాలతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్ తగదు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుంచి ద్వితీయంలో కుజుడి సంచారం మొదలవుతుంది. కాబట్టి మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక విషయాల్లోనూ జాగ్రత్త అవసరం. పెద్దగా ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుంచి జన్మంలో కుజుడి సంచారం మొదలవుతుంది కాబట్టి.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. కీలక సమస్యల నుంచి బయటపడే చర్చలు కలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుంచి వ్యయంలో కుజుడి సంచారం మొదలవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎవరితో ఏం మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియక సతమతమవుతారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏకాదశలో ఉన్న కుజుడు అన్నివిధాలా యోగిస్తున్నప్పటికీ.. చతుర్థంలో ఉన్న చంద్రుడు ఇబ్బంది పెడతాడు. లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలన్న నిర్ణయాలు తీసుకుంటారు. రోజంతా మంచిచెడుల తలపోతలతో గడిచిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తృతీయంలో ఉన్న చంద్రుడు పనులు పూర్తయ్యేందుకు సహకరిస్తాడు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఈరోజుని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుంచి కుజస్తంభనం వెళిపోయినప్పటికీ.. మంచి ఫలితాలకు మరింత సమయం పడుతుంది. ద్వితీయంలో చంద్రుడి సంచారం ఉండటంతో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలి. వాహనమరమ్మతుల్లో అశ్రద్ధ తగదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రాశ్యాధిపతైన కుజుడు అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. దాదాపు అనుకూల ఫలితాలుంటాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి.అభిరుచులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. రహస్యాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గ్రహస్థితి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ఆర్థిక నిర్ణయాలు కలసివస్తాయి. ఎదుటివారిని ఒప్పించేందుకు చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. చర్చలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అసిడిటీ సమస్యలతో బాధపడతారు. ఈరోజు నుంచి అర్థాష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుంచి అర్థాష్టమ కుజదోషం మొదలవుతుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.


Tags:    

Similar News