cryptocurrency trading scam: ఆర్.కే.పురం ఐటీ ఉద్యోగికి క్రిప్టో మోసం – ₹29.46 లక్షల నష్టం
‘రాండోచాట్’ యాప్‌లో పరిచయం – తర్వాత నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌కు ప్రలోభం లాభాలు చూపించినా విత్‌డ్రా నిరాకరణ – 30% ట్యాక్స్ పేరుతో మోసం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు
హైదరాబాద్: ఆర్.కే.పురానికి చెందిన ఐటీ ఉద్యోగి వంగర కార్తిక్ (42)కి ఆన్‌లైన్ పరిచయమైన మహిళ ₹29.46 లక్షలు మోసపుచ్చింది. ఫారెక్స్, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని నమ్మబలికి నకిలీ యాప్ ద్వారా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
కార్తిక్ చైతన్యపురి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం – సెప్టెంబర్ 2న రాండోచాట్‌లో ప్రీతి అగర్వాల్ అనే మహిళతో పరిచయమైంది. తర్వాత ఆమె టెలిగ్రామ్ ద్వారా @Parriiiiii29 హ్యాండిల్‌తో మాట్లాడడం ప్రారంభించింది.
లాభాల మాటలతో మోసం
ఆమె ఫారెక్స్, క్రిప్టో ట్రేడింగ్ ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి https://gomktsyre.సీసీ అనే ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో అకౌంట్ తెరవమని ప్రోత్సహించింది. ఆమె చెప్పిన మాటలు నమ్మి కార్తిక్ vangkartik@gmail.com అకౌంట్ క్రియేట్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టాడు. అవి క్రిప్టోగా మారాయి.
కొద్ది రోజుల్లో అకౌంట్‌లో లాభాలు చూపించగా, విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు "ప్రాఫిట్ ట్యాక్స్" పేరుతో 30% అంటే ₹13.44 లక్షలు చెల్లించాలని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరస్కరించడంతో ఆమె బెదిరింపులకు దిగిందని తెలిపారు.
తాను మోసపోయానని గ్రహించిన కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం ₹29,46,960 నష్టం జరిగిందని తెలిపాడు.
సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కి కాల్ చేయాలని, లేదా www.cybercrime.gov.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.