విరాళం కోసం ఆశపడితే... రూ.1.61 లక్షలు నష్టపోయిన తండ్రి.
మోజ్ యాప్‌లో ప్రకటనతో వల.డబ్బు పంపకపోతే పిల్లలపై హానీ చేస్తామంటూ బెదిరింపు.కుమార్తె పెళ్లికి ఆర్థిక సాయం కోసం ప్రకటనను నమ్మి 1.61 లక్షలు మోసపోయాడు.
సైబర్ మోసాలు రోజు రోజుకి మితి మీరిపోతున్నాయి.రోజు కో తరహా మోసాలు భయటపడ్తున్నాయి. ఇలాంటి డే ఒక కొత్త తరహా మోసం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పరిధి లో నమోదైంది.ఓ వ్యక్తి తన కుమార్తె పెళ్లికి ఆర్థిక సాయం కోసం మోజ్ యాప్‌లో వచ్చిన ప్రకటనను నమ్మి రూ.1.6లక్షలు మోసపోయాడు.
ఫిర్యాదు వివరాల ప్రకారం, బాధితుడు శంషాబాద్, తొందపల్లి కి చెందిన షేక్ ఖాజా పాష మోజ్ యాప్‌లో అవసరమైన వారికి విరాళాలు ఇస్తామని చెప్పిన ప్రకటనను గమనించాడు. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా, మొదట 50 వేలు అడిగినప్పటికీ మోసగాళ్లు ఒక లక్ష రూపాయల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు.
తరువాత అనేక నంబర్ల నుండి కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. మొదట 900 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో అడిగారు. తరువాత తన భార్య ఖాతాలో ఒక లక్ష జమ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్ పంపించారు.
తరువాత మరిన్ని డబ్బులు పంపితేనే మొత్తం విడుదల అవుతుందని నమ్మించి, బాధితుడి నుండి మొత్తం రూ.1.6లక్షలు వసూలు చేశారు. అయితే ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ కాలేదు.
డబ్బు పంపకపోతే పిల్లలపై హానీ చేస్తామంటూ బెదిరించడంతో భయపడి బాధితుడు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తరువాత తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు వాడిన నంబర్లు కూడా అందించాడు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.