Online trading scam:ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మోసం.. రూ.10.21 లక్షలకు టోకరా

హైదరాబాద్ లోని లంగర్‌హౌస్‌కు చెందిన 42ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పెట్టుబడి మోసానికి గురయ్యాడు.

Update: 2025-10-27 12:05 GMT

హైదరాబాద్ లోని లంగర్‌హౌస్‌కు చెందిన 42ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పెట్టుబడి మోసానికి గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఫేస్‌బుక్‌లో పరిచయం, విశాఖ మహిళగా నమ్మకం కలిగించింది. ఆయనకు 10.21 లక్షల రూపాయల నష్టం జరిగింది.అక్టోబర్‌ 21న సాయి ప్రీతి అనే పేరుతో యూకేలో ఉన్న విశాఖపట్నం మహిళగా తనను పరిచయం చేసుకున్న ఓ మహిళ ఫేస్‌బుక్‌ ద్వారా బాధితుడికి సందేశం పంపింది. క్రమంగా సన్నిహితంగా మారి, పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది.

తొలుత చిన్న లాభాలు చూపడంతో...
ఆమె సూచనల మేరకు బాధితుడు తొలుత 50వేల రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేశాడు. మొదట చిన్న లాభాలు చూపించడంతో నమ్మకం పెరిగి, సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 10వ తేదీ వరకు మొత్తం 10.21 లక్షల రూపాయలు ఆమె చెప్పిన యూపీఐ ఐడీలు, బ్యాంక్‌ ఖాతాలకు పంపాడు. ఆపై 14 వేలు విత్‌డ్రా చేసుకోవాలనగానే లావాదేవీ విఫలమైంది. పన్నుల పేరుతో మరిన్ని చెల్లింపులు చేయాలని మోసగాళ్లు డిమాండ్‌ చేశారు. అప్పుడు తాను మోసపోయినట్లు బాధితుడు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Tags:    

Similar News