ఫేక్ APKల ముప్పు: నకిలీ యాప్‌లను గుర్తించి, భద్రంగా ఉండటం ఎలా?

ఈనాటి డిజిటల్ ప్రపంచంలో, మొబైల్ యాప్‌లు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే, గూగుల్ ప్లే స్టోర్ వెలుపల యాప్‌

Update: 2025-09-29 12:21 GMT

Fake APK scams

ఈనాటి డిజిటల్ ప్రపంచంలో, మొబైల్ యాప్‌లు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాయి. అయితే, గూగుల్ ప్లే స్టోర్ వెలుపల యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు, తరచుగా APK అనే ఫైల్ ఫార్మాట్ మనకు కనబడుతుంది. చాలా మంది యూజర్లు APK ఫైల్స్ ఇన్‌స్టాల్ చేయడంలో హ్యాకింగ్, బ్యాంక్ మోసాలకు భయపడుతుంటారు, ఇలాంటి మోసాలు తరచూ జరుగుతున్నాయి కూడా. APK అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటి, వ్యవహారంలోని అప్రమత్తత ఎందుకు అవసరమో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 20, 2025 మధ్య హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు నివాసితులు తమ మొబైల్ పరికరాల్లో హానికరమైన APK ఫైల్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ₹4.85 లక్షలకు పైగా మోసపోయారు. దీని వలన మోసగాళ్లు వారి బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయగలిగారు.

ముషీరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల వ్యక్తి “RTO-E_CHALLAN.APK” యాప్ డౌన్లోడ్ వల్ల ఫోన్ హ్యాక్ అయ్యి, HDFC బ్యాంక్ ఖాతా నుండి ₹1.82 లక్షలు పోగొట్టుకున్నాడు. చుడీబజార్‌లో నివసిస్తున్న 54 ఏళ్ల బాధితుడు మరో మోసపూరిత 'చలాన్' APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి మూడు అనధికారిక లావాదేవీల ద్వారా తన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా నుండి ₹1 లక్ష నష్టపోయాడు. భోలక్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి “కోర్ట్ ఆర్డర్ RTO APK”, “PM కిస్సాన్ APK” వంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఆయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో ₹2,03,873 అనధికార లావాదేవీలు జరిగాయని తెలిపాడు. అన్ని సందర్భాల్లో, బాధితుల ఫోన్‌లు హ్యాక్ అయి, వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు) దుర్వినియోగపడి, పైగా సున్నితమైన బ్యాంకింగ్ డేటా దొంగిలించబడింది.

APK ఫైల్ అంటే ఏమిటి?

APK అనేది “Android Package Kit” సంక్షిప్త రూపం. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించే ఫైల్ ఫార్మాట్, విండోస్‌లో .exe ఫైల్‌లకు సమానం. ఒక APK ఫైల్ యాప్ ఇన్‌స్టాల్ అవడానికి పనికొచ్చే మొత్తం కోడ్, రిసోర్సెస్, అసెట్స్, సర్టిఫికెట్‌లను కలిగి ఉంటుంది.

APK ఫైల్స్ ఎందుకు ముఖ్యమైనవి?

కొన్ని సందర్భాల్లో యాప్‌లు ప్లే స్టోర్‌లో region or developer పరిమితుల వల్ల కనిపించవు. APK ఫైల్స్ ద్వారా యూజర్లు వాటిని మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేయవచ్చు. అలాగే, కొత్త వెర్షన్‌లను ఉన్నప్పుడు ముందుగానే అప్డేట్ చేసుకోవచ్చు. టెక్-సావీ యూజర్లు స్పెషల్ ఫీచర్ల కోసం మాడిఫైడ్ APKలను కూడా ఉపయోగిస్తారు.

ఫేక్ APKలు అంటే ఏమిటి?

ఫేక్ APKలు Android వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న పెరుగుతున్న సైబర్ నేర ముప్పు. APK అనేది Android యాప్‌ల కోసం ప్రామాణిక ఫైల్, కానీ సైబర్ నేరగాళ్లు ఈ ఫైళ్లను మోసం చేయడానికి మారుస్తారు లేదా నకిలీ చేస్తారు. ఫేక్ APK ఒక నిజమైన అప్లికేషన్‌లా లేదా ఒక ప్రముఖ యాప్ యొక్క మార్చిన వెర్షన్‌లా నటిస్తుంది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఇది వ్యక్తిగత వివరాలను దొంగిలించగలదు, యూజర్ కార్యకలాపాలను పర్యవేక్షించగలదు లేదా పెద్ద ఎత్తున ఆర్థిక మోసాన్ని కూడా సులభతరం చేయగలదు.

ఫేక్ APKలు ఎలా తయారవుతాయి?

దాడి దారులు కొన్నిసార్లు ఒక అసలు యాప్‌లోకి హానికారక కోడ్‌ని చొప్పించి, దాన్ని తిరిగి ప్యాక్ చేస్తారు, దీని వలన అది మామూలు యాప్‌లా కనిపిస్తుంది. వేరే సందర్భాల్లో, వారు విశ్వసనీయ యాప్‌ల పేరు, చిహ్నం, రూపకల్పనను కాపీ చేసి, పూర్తిగా కొత్త నకిలీ యాప్‌లను తయారు చేస్తారు. చాలా ఫేక్ APKలు బ్యాంకింగ్ వివరాలను సేకరించడానికి నకిలీ లాగిన్ స్క్రీన్‌లను చూపించడం లేదా OTPలను దొంగిలించడం కోసం తయారు చేయబడతాయి. ఇతర APKలు ఫ్రీ యుటిలిటీలుగా, ఆట హ్యాక్‌లుగా లేదా ప్రీమియం యాప్‌ల మాడ్ వెర్షన్‌లుగా కనిపిస్తాయి కానీ లోపల గూఢచార సాఫ్ట్‌వేర్, ర్యాన్సమ్‌వేర్ లేదా యాడ్-ఫ్రాడ్ కోడ్‌ని తీసుకెళ్తాయి.

ఫేక్ APKలు ఎలా వ్యాప్తి చెందుతాయి?

ఈ హానికరమైన యాప్‌లు సాధారణంగా Google Playలో కనిపించవు, ఎందుకంటే అధికారిక స్టోర్ భద్రతా ఫిల్టర్లను ఉపయోగిస్తుంది. ఇవి మూడవ పక్ష యాప్ స్టోర్లు, ఫిషింగ్ వెబ్‌సైట్లు, ఫైల్-షేరింగ్ సైట్లు, సోషల్ మీడియా, SMS లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఫ్రీ ప్రీమియం వెర్షన్‌లు, కొత్త ఫీచర్లకు ముందస్తు యాక్సెస్ వంటి ఆకర్షణీయమైన వాగ్దానాలతో యూజర్లను మోసం చేస్తారు.

ఫేక్ APKలు వల్ల కలిగే ప్రమాదాలు

వాస్తవంగా, నమ్మదగని సోర్సెస్, లేదా వెబ్సైట్ల నుంచి APKను డౌన్‌లోడ్ చేస్తే, దానితో పాటు మాల్వేర్ లేదా స్పైవేర్ దిగుమతి చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్, UPI యాప్‌లను అనుకరించేవి ఎన్నో ఉన్నాయి, అవి OTPలు, పాస్‌వర్డ్‌లు, SMS, కాంటాక్ట్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించగలవు. ఈ APK ఫైల్‌లలో మాల్వేర్ ఉంటుంది, ఇది ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత వినియోగదారుల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించి, అనధికారిక లావాదేవీలకు పాల్పడటం లేదా మోసపూరిత కొనుగోళ్లు చేయడం ద్వారా భారీ ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. కొన్ని ఫేక్ APKలు ఫోన్‌ను రిమోట్‌గా కూడా నియంత్రించగలవు.

సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా క్యాష్‌బ్యాక్, ఉచిత రీఛార్జ్, బ్యాంక్ అప్‌డేట్ పేరుతో పంపబడే రాండమ్ APK లింక్‌ల పై క్లిక్ చేయడం వల్ల డబ్బు నష్టం, వ్యక్తిగత డేటా దొంగలిస్తారు మోసగాళ్లు. 2024-25లో భారత్‌లో ఫేక్ APK స్కామ్‌ల కారణంగా చాలామంది బాధితులు దాదాపు ₹779 కోట్ల వరకు డబ్బు కోల్పోయారు. రోజూ రూ.10-15 లక్షలు వరకు స్కామ్‌లు జరుగుతుండగా, పలు అకౌంట్లు ఖాళీ కాబడుతున్నాయనే కనిపిస్తోంది.

సందేహాస్పద APKలను ఎలా పరిశీలించాలి?

APKఫైల్‌ వివరాలు, ప్యాకేజ్ పేరు, డెవలపర్ వివరాలు అసలైన యాప్‌కు వర్తించకపోతే అది నకిలీ అయ్యే అవకాశం ఉంది. అనవసరమైన అనుమతులు, abnormal battery drain, తప్పుదారి పట్టించే pop-ups, అదనంగా SMS పంపడం, Google Play Protectని ఆపమని సూచనలు – ఇవన్నీ డేంజర్ సిగ్నల్స్.

ఆ యాప్ Google Play Storeలో ఉందా, అధికారిక వెబ్‌సైట్‌లో ఉందా అన్నది చెక్ చేయాలి.

APK ఫైల్స్ వివరాలు, version, permissions, digital signature, sandbox analysis వంటి పాయింట్లను కూడా పరిశీలించడం అవసరం.

అనవసర permissions ఉన్నాయా, abnormal battery drain ఉందా, అధిక pop-ups వస్తున్నాయా అంటూ గమనించండి.

మరింత అవగాహన కోసం IT నిపుణుల సలహా తీసుకోవచ్చు.

సురక్షితంగా ఎలా ఉండాలి?

Google Play Store, APKMirror, అధికారిక వెబ్‌సైట్‌ల వంటి నమ్మకమైన మూలాల నుండే APKలను డౌన్‌లోడ్ చేయండి.SMS, WhatsApp, email ద్వారా వచ్చే రాండమ్ APK లింక్‌లపై క్లిక్ చేయొద్దు.

యాప్ permissions‌ను ఇన్‌స్టాల్ ముందు, తరువాత తప్పకుండా తనిఖీ చేయండి. Google Play Protectను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచండి. బ్యాంకింగ్/యాప్‌లలో పాస్వర్డ్, OTP వంటి data ఎప్పుడూ పరిచయం లేని యాప్‌లలో ఇవ్వొద్దు.

నకిలీ బ్రాండ్లు, బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేరుపెట్టి త్వరగా వ్యాప్తి చెందుతున్న వేరు వేరు స్కామ్‌లలో fake APKలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. APK ఫైల్, లేదా లింక్‌నను సమర్థవంతంగా cyber crime police లకు, Google Safe Browsing, social media platformsకు రిపోర్ట్ చేయాలి.

ఈ తరహా కేసుల నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ప్రజలు SMS, WhatsApp, టెలిగ్రామ్, సోషల్ మీడియా లింక్‌ల ద్వారా వచ్చే APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని తెలుస్తోంది. యాప్‌లను Google Play లేదా Apple App Store వంటి అధికారిక స్టోర్‌ల నుంచే ఇన్‌స్టాల్ చేయాలని నొక్కి చెప్పారు.

APK ఫైల్‌లు స్వతహాగా హానికరం కావు కాదు, అవి కేవలం యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే ఒక విధానం మాత్రమే. నిజమైన ప్రమాదం వాటిని ఎక్కడ నుంచి పొందుతున్నామన్నది. మూలాన్ని ఎప్పుడూ ధృవీకరించండి, అప్రమత్తంగా ఉండండి. ఈ డిజిటల్ యుగంలో, ఒక చిన్న అజాగ్రత్త క్లిక్ కూడా డబ్బు లేదా డేటా నష్టానికి దారితీయవచ్చు.

Tags:    

Similar News