online trading scam:కూకట్‌పల్లిలో వ్యాపారవేత్తకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మోసం – ₹9.4 లక్షలు గాయభయ్యాయి

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో తీరుతెన్నులు నమ్మదగినవిగా కనిపించడంతో పెట్టుబడి. తొలుత కొంత సొమ్ము ఉపసంహరించుకునేలా అనుమతించడంతో నమ్మకం. పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసిన తర్వాత విత్‌డ్రా నిలిపివేత.

Update: 2025-10-27 12:49 GMT

నకిలీ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా మోసగాళ్ల వలలో వ్యాపారవేత్త

హైదరాబాద్‌: కూకట్‌పల్లికి చెందిన వ్యాపారవేత్తకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో మోసగాళ్లు రూ.9,40,392 ఎగనామం పెట్టారు. ఈ మేరకు 39 ఏళ్ల ఎం.సంతోష్‌కుమార్‌ (ఆల్‌విన్‌ కాలనీ) జగ్గద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, అక్టోబర్‌ 22, 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో “VIXOTRADE.COM (Silver Praxis Social M DU)” అనే ట్రేడింగ్‌ పోర్టల్‌ ప్రకటన చూసిన సంతోష్‌కుమార్‌ దానిపై ఆసక్తి చూపారు. ఆ వీడియో తీరుతెన్నులు నమ్మదగినవిగా కనిపించడంతో ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్‌ అయ్యారు. అయితే ఆ ప్రకటన ‘డీప్‌ఫేక్‌ AI వీడియో’గా  తెలుగు పోస్ట్‌ ఫ్యాక్టచెక్ చేసింది.

మోసగాళ్ల ట్రేడింగ్‌ నాటకం

సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం, “ప్రొఫెసర్‌ అసాద్‌” పేరుతో ఉన్న వ్యక్తి (యూకే నంబర్‌ +44 7346 245896) ప్రారంభంలో సంప్రదించగా, అనంతరం “అసాద్‌ అలీ” (ఇండియా నంబర్‌ +91 80653 29814) అనే వ్యక్తి “గ్రూప్‌ అనలిస్ట్‌”గా పరిచయం అయ్యాడు. బ్లాక్‌ ట్రేడింగ్‌, ఐపీవో అలాట్‌మెంట్లు, ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రేడింగ్‌ వంటి పనుల్లో మార్గదర్శనం చేస్తానని నమ్మించాడు. 

సైట్‌ ద్వారా లాగిన్‌ వివరాలు ఇచ్చి, మొదట యూనియన్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.17,800 జమ చేయించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత రూ.4,393 ఉపసంహరించుకునేలా అనుమతించడంతో నమ్మకం పెరిగింది. ఆ తర్వాత సూచనల ప్రకారం మొత్తం రూ.9,40,392 వివిధ ఖాతాలకు బదిలీ చేశారు.

తరువాత బ్లాక్‌ – డబ్బులు గాలంలో

పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో రూ.9,35,999 లాభం చూపించినా, విత్‌డ్రా ఆప్షన్‌ బ్లాక్‌ చేసి, ఫండ్‌ రిలీజ్‌ కోసం మరో 20% కమిషన్‌ చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చారని ఆయన చెప్పారు. సంతోష్‌కుమార్‌ తిరస్కరించడంతో సంబంధాలు నిలిపేసి, విత్‌డ్రా ఆప్షన్‌ను నిలిపివేశారు.

తరువాత వెబ్‌సైట్‌, యాప్‌ నకిలీవని, తాను డబ్బులు పంపిన ఖాతాలు తెలియని వ్యక్తుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు. వాటిలో Vixo Trade.com, Silver Praxis Social M DU, జైదుల్‌ ఇస్లాం (ఫోన్‌: 9101491794), కౌశిక్‌ సర్కార్‌ (యూపీఐ చివరి సంఖ్య 4846@Jio) ఉన్నాయని ఫిర్యాదులో తెలిపారు.

సైబర్‌ మోసాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేయవచ్చు లేదా www.cybercrime.gov.in

వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.

Tags:    

Similar News