టెకీకి ₹1.3 కోట్లు మోసం
నకిలీ ‘IEXS ట్రేడింగ్’ యాప్ ద్వారా చీటింగ్ విత్‌డ్రా పేరుతో మళ్లీ మళ్లీ డబ్బు అడిగిన మోసగాళ్లు
హైదరాబాద్: మియాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం.కిరణ్‌కుమార్ (37) నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ మోసానికి బలి అయ్యాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన ఫిర్యాదు మేరకు నవంబర్ 5, 2025న కేసు నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, కిరణ్ ఏప్రిల్ 2025లో ‘IEXS ట్రేడింగ్’ పేరుతో నకిలీ ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. చట్టబద్ధమైన ట్రేడింగ్ సర్వీసులు, లాభాల ఉపసంహరణ ఉంటాయని చెప్పి మోసగాళ్లు అతనిని నమ్మించారు. వారు వాట్సాప్ నంబర్లు 8367567134, 9867464159, 7379390478, 8121631905, 8341332631, తర్వాత 9618311781 ద్వారా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లుగా పరిచయం అయ్యారు.
నకిలీ లాభాలతో నమ్మకం పొందారు
ప్రారంభంలో కిరణ్ ₹10.25 లక్షలు వెబ్‌సైట్లు https://pc.iexsinfonsce.cc, https://m.iexsinfonsce.ccద్వారా డిపాజిట్ చేశాడు. కొద్ది వారాల్లోనే 83,248 అమెరికన్ డాలర్ల లాభం చూపించారు. దీనితో అతడు మరిన్ని పెట్టుబడులు పెట్టాడు.
అయితే లాభం విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగానే మోసగాళ్లు “ఇన్‌కమ్ ట్యాక్స్, కరెన్సీ కన్వర్షన్, అకౌంట్ రివ్యూ, గవర్నమెంట్ చార్జీలు” పేర్లతో మరిన్ని చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. అవి నిజమని నమ్మి కిరణ్ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మొత్తం ₹1.3 కోట్లు బదిలీ చేశాడు.
చివరికి మోసమని గ్రహించాడు
నవంబర్ 1న చివరి లావాదేవీగా 15,000 డాలర్లు పంపిన తర్వాత మళ్లీ డబ్బు అడగడంతో కిరణ్ మోసమని గ్రహించాడు. ఖాతా లాగిన్ అవుతున్నా, విత్‌డ్రా బ్లాక్ చేశారు. చివరికి ₹3,600 మాత్రమే తిరిగి ఇచ్చారు.
పోలీసులు చెబుతున్నదేమిటంటే, నకిలీ ట్రేడింగ్ యాప్ రూపొందించి, పలు బ్యాంకు అకౌంట్లు, యూపీఐ ఐడీల ద్వారా కేటుగాళ్లు కాజేశారంటున్నారు. 318(4), 319(2), 336(3), 338, 340(2) సెక్షన్లతోపాటు భారతీయ న్యాయ సన్‌హిత 3(5) సెక్షన్, ఐటీ చట్టం 66-D కింద కేసు నమోదైంది. మోసానికి పాల్పడిన వారి ఖాతాలు, డొమైన్ యజమానులను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.