నకిలీ ఎస్‌బీఐ కేవైసి యాప్‌ తో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రూ.2.5లక్షలు నష్టం

వాట్సాప్‌ గ్రూపులో ఎస్‌బీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లు ఆధార్‌ కార్డు వివరాలు షేర్‌ చేసిన వ్యక్తి ఖాతా ఖాళీ

Update: 2025-10-22 12:09 GMT

జగ్గద్గిరిగుట్టకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒకరు నకిలీ ఎస్‌బీఐ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయడంతో రూ.2.58 లక్షలు మోసపోయారు.పూర్తి వివరాల్లోకి వెళితే, మక్తూమ్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌కు చెందిన సంగయ్య కుమారుడు జనార్ధన్‌ (58) అక్టోబర్‌ 18న ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో చేర్చబడ్డారు. ఆ గ్రూపులో వచ్చిన ఓ సందేశంలో, తన భార్య జగదంబ ఎస్‌బీఐ ఖాతా ఆధార్‌ అప్‌డేట్‌ చేయకపోవడంతో ఆ ఖాతా ఆ రోజు రాత్రే బ్లాక్‌ అవుతుందని పేర్కొన్నారు.ఆన్లైన్ లో కేవైసి అప్డేట్ చేసుకోమని సూచించారు.

దాని కోసమని “SBI AADHAR UPDATE.apk” పేరుతో ఉన్న ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పారు. అది ద్రువీకరించబడిన యాప్‌ అని నమ్మిన జనార్ధన్‌, భార్య ఆధార్‌ నంబర్‌, డెబిట్‌ కార్డు వివరాలు, సీవీవీ కోడ్‌ అందులో పొందు పర్చారు. 

ఆ తరువాత ఖాతా బ్యాలెన్స్‌ చెక్‌ చేయగా, రూ.2.58 లక్షలు మూడు విడతల్లో విత్‌డ్రా అయినట్లు గమనించిన జనార్దన్ తాను మోసపోయిన విషయం తెలుసుకుని అతను పోలీసులను సంప్రదించాడు.

సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ నకిలీ లింక్‌ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. 

Tags:    

Similar News