Cyber Crime: టెలిగ్రామ్‌లో ఉద్యోగం ఆఫర్‌ చేసి 51లక్షలు మోసం

ఈ–కామర్స్‌ పార్ట్‌టైం పనిగా చెప్పి మోసగాళ్లు ఉచ్చు అకౌంట్‌ తిరిగి యాక్టివ్‌ చేసుకోవాలంటే డిపాజిట్‌ చేయమని ఒత్తిడి

Update: 2025-10-29 10:51 GMT

హైదరాబాద్‌: మదీనగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హనుమంతు జర్పాల (43) టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఫేక్‌ ఉద్యోగ ఆఫర్‌తో మోసపోయారు. ఆయనకు అక్టోబర్‌ 1న @RiyaLall అనే ఐడీ నుంచి సందేశం వచ్చింది. ఆ వ్యక్తి తాను ఈ–కామర్స్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ అని పార్ట్‌టైం పని ఆఫర్‌ చేసింది.

తరువాత మరో ఐడీ @MeeraSuri ద్వారా సంప్రదించి www.polybarkstyles.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాలని చెప్పింది. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆయన వాలెట్‌లో రూ.10 వేల క్రెడిట్‌ అయ్యాయి. ఆ తర్వాత “క్విక్‌క్రాఫ్ట్‌ రివ్యూ” సెక్షన్‌లో ఉత్పత్తుల సమీక్షల పనులు అప్పగించారు. ప్రతి టాస్క్‌ తర్వాత “నెగటివ్‌ బ్యాలెన్స్‌ క్లియర్‌ చేయాలంటే” అదనపు మొత్తాలు జమ చేయమని చెప్పారు.

ఇలా నమ్ముతూ జర్పాల ఒక్కొక్కసారి రూ.10 వేల నుంచి రూ.14.85 లక్షల వరకు డబ్బులు  పంపారు. చివరికి మరో వ్యక్తి @Ashoka అనే ఐడీతో పరిచయమై, తాను “పీ అండ్‌ బీ సొల్యూషన్స్‌” యాడ్మిన్‌ అని చెప్పాడు. అన్ని టాస్క్‌లు పూర్తయ్యాక ఆయన వాలెట్‌లో రూ.78.97 లక్షల వర్చువల్‌ లాభం వచిందన్నాడు. అయితే withdraw చేసుకోవాలంటే 25 శాతం “వెరిఫికేషన్‌ ఫీ”తోపాటు రూ.12లక్షల “రెస్టోరేషన్‌ డిపాజిట్‌” చెల్లించాలన్నారు. అవి చెల్లించినా డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని తెలుస్కున్న హనుమంత్ కూకట్‌పల్లీ పోలీసులను ఆశ్రయించారు.

మొత్తం రూ.51.82 లక్షలు ట్రాన్స్ఫర్‌ చేయగా, రూ.48,324 మాత్రమే తిరిగి లభించాయి. మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్పాల కోరారు. పోలీసులు www.polybarkstyles.com, www.polybarkdecors.com వెబ్‌సైట్లు, అలాగే టెలిగ్రామ్‌ ఐడీలు @RiyaLall, @MeeraSuri, @Ashoka, support@polybarkfurniture.com

(P&B Solutions Team)లను దర్యాప్తులో చేర్చారు.

Tags:    

Similar News