ఆన్‌లైన్‌ పెట్టుబడి మోసం.. వ్యాపారికి రూ.27 కోట్ల నష్టం

మలక్‌పేట్‌కు చెందిన వ్యాపారి టెలిగ్రామ్‌ గ్రూప్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా నడిచిన పెట్టుబడి మోసంలో తాను రూ.27.4 కోట్లు కోల్పోయానని ఫిర్యాదు చేశారు.

Update: 2025-09-25 12:26 GMT

మలక్‌పేట్‌కు చెందిన 34 ఏళ్ల వ్యాపారి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. టెలిగ్రామ్‌ గ్రూప్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా నడిచిన పెట్టుబడి మోసంలో తాను రూ.27.4 కోట్లు కోల్పోయానని ఆయన ఫిర్యాదు చేశారు.

విదేశీ నంబర్‌ నుంచి కాల్‌
ఫిర్యాదు ప్రకారం ఈ ఏప్రిల్‌లో వి.హేమంత్‌రెడ్డి, తాను గూగుల్ సెర్చ్ చేస్తుండగా ఒక విదేశీ నంబర్‌ నుంచి కాల్‌ వచ్చిందన్నారు. తనను "నరేశ్‌ గోపాల్‌"గా పరిచయం చేసుకున్న వ్యక్తి, తాను ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అని చెప్పాడని వివరించారు.

టెలిగ్రామ్‌ గ్రూప్‌లోకి...  
ఆ తర్వాత "Financial Assistance_179 Investment Group" అనే టెలిగ్రామ్‌ గ్రూప్‌లోకి చేర్చారని రెడ్డి తెలిపారు. అందులో ఫైనాన్షియల్‌ నిపుణులమని చెప్పుకుంటూ పలువురు సభ్యులు ఉన్నారని చెప్పారు. "HappyAce" అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ట్రేడింగ్‌ మొదలు పెట్టమని ప్రోత్సహించారని వివరించారు.

మొదటగా రూ.2 వేల పెట్టుబడి పెట్టారని, తర్వాత ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తూ పెద్ద మొత్తాలు వేయమని ఒత్తిడి చేశారని తెలిపారు.అలా పలు దఫాలుగా పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తూ వచ్చారని తెలిపారు. పలుమాసాలుగా అధిక లాభాలు చూపుతూ మరింత పెట్టుబడి పెట్టెల నమ్మించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.తాను withdraw చేసుకుందాం అని ప్రయత్నించినప్పిటి నుండి తను ఫోన్లు కానీ, వాట్సాప్ కి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను అశ్రయించినట్టు  హేమంత్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.


Tags:    

Similar News