డాక్టర్ రెడ్డీస్‌కు 2.16 కోట్లు టోకరా
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ 2 కోట్ల 16 లక్షల రూపాయల సైబర్ మోసానికి గురైంది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ 2 కోట్ల 16 లక్షల రూపాయల సైబర్ మోసానికి గురైంది. గ్రూప్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కి చెల్లించాల్సిన డబ్బుని నకిలీ ఈమెయిల్ ద్వారా వచ్చిన అకౌంట్‌కు పంపింది. దీంతో సదరు సంస్థ పోలీసులను సంప్రదించింది. డబ్బులు అకౌంట్‌కు పంపిన ఫండ్స్‌ను ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకుంది. మోసపూరిత ఖాతా గుజరాత్‌లోని వడోదరకు చెందినదని పోలీసులు గుర్తించారు. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మోసాన్ని వెంటనే గుర్తించామని, బ్యాంక్ అధి కారులకు చెప్పి నగదు బదిలీ కాకుండా ఆపించగలిగామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది.