Digital Arrest Scam: డిజిటల్‌ అరెస్టు మోసంలో ₹41 లక్షలు పోగుట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి

ముంబై పోలీస్‌, సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లు ; నకిలీ ఆర్‌బీఐ పత్రాలతో నమ్మబలికారు

Update: 2025-10-30 04:42 GMT

 కోండాపూర్‌కు చెందిన 67 ఏళ్ల సి.జనార్ధన్‌రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగిని డిజిటల్‌ అరెస్టు పేరుతో మోసగాళ్లు  రూ.41.20 లక్షలు కొట్టేసారు.

సెప్టెంబర్‌ 25న తాను ముంబైకు చెందిన పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అంటూ ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. కొంతసేపటికి మరో నంబర్‌ నుంచి వాట్సాప్‌ వీడియో కాల్‌లో మాట్లాడాడు.

ఆధార్‌ నంబర్‌తో నేరాల ఆరోపణ

ఆ వ్యక్తి మాట్లాడుతూ జనార్దన్ ఆధార్‌ కార్డు ఆధారంగా ముంబైలో కనరా బ్యాంక్‌ ఖాతా తెరిచారని, అది మానవ అక్రమ రవాణా, నిధుల మార్పిడి వ్యవహారాల్లో ఉందని తెలిపాడు. జనార్దన్ ఆ ఆరోపణలను ఖండించగా, అతన్ని "అనుమానితుడు"గా విచారణలో ఉన్నారని హెచ్చరించాడు.

తర్వాత మరో వ్యక్తి  సీబీఐ అధికారిగా నటిస్తూ వీడియో కాల్‌లో చేరి, జనార్దన్ పేరుతో అంతర్జాతీయ మనీ లాండరింగ్‌ కేసు నమోదైందని చెప్పారు. సహకరించకపోతే అరెస్టు చేస్తామని, ఖాతాలు స్తంభింపజేస్తామని బెదిరించారు.

నకిలీ ‘ఆర్‌బీఐ ధృవీకరణ ఖాతా’కు బదిలీ

తన డబ్బు అక్రమ్ సంపాదన కాదని నిరూపించాలంటే ఆర్‌బీఐ ‘వెరిఫికేషన్‌ ఖాతా’కి మొత్తాన్ని బదిలీ చేయాలని మోసగాళ్లు చెప్పారు. 12–24 గంటల్లో ధృవీకరించి తిరిగి జమ చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వసనీయంగా కనిపించేందుకు ఆర్‌బీఐ, పోలీస్‌ శాఖ పేర్లతో నకిలీ పత్రాలు వాట్సాప్‌లో పంపారు.

బెదిరింపులకు భయపడి, జనార్దన్ హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ ఖాతాల నుంచి మొత్తం ₹41.20 లక్షలు ఆర్‌టీజీఎస్‌ ద్వారా మోసగాళ్లు ఇచ్చిన ఖాతాలకు బదిలీ చేశారు. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దని, లేకపోతే పది లక్షల జరిమానా, జైలుశిక్ష ఎదురవుతుందని హెచ్చరించారు.

మోసం తెలిసి ఫిర్యాదు

నిర్దేశిత సమయానికి డబ్బు తిరిగి రాకపోవడంతో జనార్దన్ కి  అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News