ప్రసాద్ అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యతో ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ టెక్ కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు ప్రసాద్. స్వగ్రామానికి వచ్చి ఇంటి నుంచి పని చేస్తున్న ప్రసాద్ మంగళవారం ఉదయం నెమలం శివార్లలో శవమై కనిపించాడు.
ప్రసాద్‌ని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రసాద్ సోమవారం రాత్రి తన బైక్‌పై తాత గారి ఊరు బూరిపేట నుంచి నెమలాం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి తలపై తీవ్ర గాయంతో పాటు శరీరంపై దెబ్బలకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ప్రసాద్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు.