America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా యువకుడి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడు మృతి చెందారు
young man from telangana region died in a road accident in america
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడు మృతి చెందారు. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు సాయి రాజీవ్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి కుమారుడు సాయి రాజీవ్ రెడ్డి టెక్సాస్ లో ఉంటున్నారు.
విమానాశ్రయం నుంచి...
అయితే ఆదివారం టెక్సాస్ లోని ఒక పార్సిల్ ను తీసుకుని కారులో విమానాశ్రయం నుంచి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొనింది. దీంతో సాయి రాజీవ్ మరణించినట్లు అక్కడి వారు చెబుతున్నారు. గాయపడిన సాయిరాజీవ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించేలోగానే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అమెరికాకు బయలుదేరి వెళ్లారు.