Nirmal Road Accident : బోల్తాపడిన బస్సు.. ఒకరి మృతి.. ఇరవై ఐదుమందికి గాయాలు

నిర్మల్ జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించగా, ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి

Update: 2024-05-23 04:15 GMT

Nirmal Road Accident :నిర్మల్ జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణించగా, ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం మహబూబాఘాట్ వద్ద బస్సు బోల్తా పడింది. ఈరోజు తెల్లవారు జాను జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఫర్మానా అనే యువతి మరణించింది. ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఒక ప్రయివేటు బస్సు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది.

గాయపడిన వారిలో...
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై మంది వరకూ ప్రయాణికులున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News