టీవీ సౌండ్ తగ్గించమంటే.. భర్తను హత్య చేసిన భార్య
సీరియల్ చూస్తున్న భార్యను సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది
చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అవి హత్యలకు దారి తీస్తున్నాయి. సీరియల్ చూస్తున్న భార్యను సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. షేక్ అహ్మద్, క్రాంతి లు ఇద్దరూ గత కొంత కాలంగా మంగళగిరిలోని టిడ్కో ఇళ్లలో నివాసముంటున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఆసుపత్రికి తరలించగానే...
మృతుడు షేక్ అహ్మద్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన అహ్మద్ టీవీ ఎక్కువ సౌండ్ ఉండటాన్ని చూసి తగ్గించమని భార్య క్రాంతిని అడిగాడు. వెంటనే క్రాంతి అహ్మద్ ను కత్తితో పొడిచింది. దీంతో అహ్మద్ కు తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న స్థానికులు వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడగులో ఉన్న అహ్మద్ ను హుటాహుటిన విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. విజయవాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందాడు. క్రాంతిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.