బొగ్గుల శ్రీనివాస్ ది హత్యే

ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది హత్య ని ఖమ్మం పోలీసులు తెలిపారు

Update: 2026-02-22 12:12 GMT

ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది హత్య ని ఖమ్మం పోలీసులు తెలిపారు. హత్య పై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది సుపారీ హత్య అని ఆయన తెలిపారు ఆర్థిక లావాదేవీలు హత్యకు కారణమని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని ఖమ్మం పోలీసులు తెలిపారు.

ఆర్థిక లావాదేవీలే...
నార్కేట్ పల్లి - నకిరేకల్ మధ్య హత్య చేసి, పాలేరు రిజర్వాయర్ లో శ్రీనివాస్ మృత దేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుల యత్నం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా నలుగురిని అరెస్ట్ చేసిన కూసుమంచి పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, హత్యకు ఎటువంటి సంబంధం లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.


Tags:    

Similar News