Hyderabad : భర్తను చంపేసిన భార్య.. ఎందుకో తెలిస్తే?
హైదరాబాద్ లోని కోకాపేటలో ఒక భార్య భర్తను చంపేసింది. కత్తితో పొడిచి భార్య భర్తను హతమార్చింది
భర్తలను భార్యలు హత్య చేయడం ఇటీవల దేశంలో కామన్ గా మారిపోయింది. పెళ్లి చేసుకున్న యువతులు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని కట్టుకున్నోడిని భార్యలు కొందరు కడతేరుస్తుంటే...మరికొందరు వ్యసనాలకు బానిసగా మారిన భర్త తమ కుటుంబాన్ని ఛిత్రం చేస్తుండటంతో ఆవేశంతో చంపేసిన ఘటనలు కూడా ఇటీవల కాలంలో అనేక చోట్ల చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మద్యం తాగి వచ్చి హింస పెడుతున్న భర్తలను భార్యలు అడ్డు తొలగించుకుంటున్నారని సైకాలజిస్టులతో పాటు పోలీసు అధికారులు కూడా చెబుతున్నారు.
కోకాపేటలో జరిగిన ఘటన...
తాజాగా హైదరాబాద్ లోని కోకాపేటలో ఒక భార్య భర్తను చంపేసింది. కత్తితో పొడిచి భార్య భర్తను హతమార్చింది. మృతి చెందిన వ్యక్తి అస్సాం రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అస్సాంకు చెందిన భరత్ బోరా, కృష్ణ జ్యోతి బోరా లకు వివాహం కావడంతో ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. కోకాపేటలో నివాసముంటుననారు. కూలీ పనులు చేసుకుంటూ పొట్టనింపుకుంటున్న వారి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో భర్త కృష్ణజ్యోతి బోరా భార్య భరత్ బోరాను వేధించడం మొదలు పెట్టాడు.
భర్త వేధింపులు తట్టుకోలేక...
నిన్న రాత్రి ఇంటికి వచ్చిన కృష్ణజ్యోతి బోరా భార్యను వేధించడంతో చిన్నపాటి ఘర్షణ చినికి చినికి పెద్దదయింది. దీంతో భరత్ బోరా తన భర్త కృష్ణజ్యోతి బోరాను కూరగాయలు కోసే కత్తితో దాడి చేసింది. దీంతో భర్త కృష్ణజ్యోతి బోరా కింద పడిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి విషమించి చనిపోయాడు. పోలీసులు ఈకేసులో భార్య భరత్ బోరాను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.