ఆ నగదు బంగారం వ్యాపారులదా ?

బస్సుల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం మేరకు.. విజయవాడ నుంచి టెక్కలి వెళ్లే బస్సుకు రామవరప్పాడు రింగ్ వద్ద రామకృష్ణ, రమేష్

Update: 2022-04-02 07:13 GMT

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద నిన్న పద్మావతి ట్రావెల్స్ కు చెందిన బస్సుల్లో రూ.4.76 కోట్ల నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నగదు లభ్యమైన బస్సులను సీజ్ చేశారు. డ్రైవర్లను ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి, నగదును ప.గో. జిల్లా ఏలూరు ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో పెందేళ్ల వెంకటేశ్వర రావు , కాకర్ల సుదర్శన్ , అదేశ్ మోర్ అనే ముగ్గురిని మహారాష్ట్రలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బస్సుల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం మేరకు.. విజయవాడ నుంచి టెక్కలి వెళ్లే బస్సుకు రామవరప్పాడు రింగ్ వద్ద రామకృష్ణ, రమేష్, సురేష్ అనే ముగ్గురు బంగారం ఇచ్చేవారు. ఆ బంగారాన్ని విశాఖపట్నం , సోంపేట , నరసన్నపేట చెందిన సుమారు 12 మంది బంగారం వర్తకులకి ఇవ్వాలని సూచించేవారట. బస్సుల్లో లభ్యమైన నగదు ఆ బంగారం వ్యాపారులకు చెందినదా ? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. డ్రైవర్లు చెప్పిన ఆ 12 మందిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News