కొండచరియలు విరిగి పడి..10 మంది మృతి, 28 మంది గల్లంతు

ఉత్తరకాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ నుంచి 40 మంది పర్వతాహోరహణ కోసం వెళ్లారు. అదే సమయంలో ద్రౌపది దండ -2..

Update: 2022-10-04 11:35 GMT

uttarakhand avalanche

కొండచరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకులు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఉత్తరకాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ నుంచి 40 మంది పర్వతాహోరహణ కోసం వెళ్లారు. అదే సమయంలో ద్రౌపది దండ -2 కొండపై భారీ హిమపాతం రావడంతో.. 10 మంది అక్కడే మృతి చెందారు. మరో 28 మంది గల్లంతవగా.. రెస్క్యూ టీమ్ 8 మందిని రక్షించింది. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఉత్తరాఖండ్ పోలీస్ చీఫ్ అశోక్ కుమార్ తెలిపారు.16,000 అడుగుల ఎత్తులో ఉండగా.. ఉదయం 9 గంటల సమయంలో హిమపాతం దూసుకొచ్చినట్లు తెలిపారు. గాయపడిన ట్రైనీలను 13,000 అడుగుల ఎత్తులో ఉన్న సమీపంలోని హెలిప్యాడ్‌కు, ఆపై రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌కు తరలిస్తున్నట్లు రెస్క్యూ అధికారి తెలిపారు.

ఈ ఘటనపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి చెందారు. కొండచరియల్లో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న పర్వతారోహకులను రక్షించేందుకు ప్రయత్నిస్తామని.. ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడుతామని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి.. పర్వతారోహకులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ టీమ్ లు శ్రమిస్తున్నాయని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News