గీతతో రాత మార్చిన చిన్నారి...తనతల్లిని ఎవరు హత్య చేశారో?

ఉత్తర్ ప్రదేశ్ లోని మహిళ అనుమానాస్పద మృతిని ఆమె కూతురు పోలీసులకు చిక్కేలా చేసింది

Update: 2025-02-18 08:01 GMT

ఉత్తర్ ప్రదేశ్ లోని మహిళ అనుమానాస్పద మృతిని ఆమె కూతురు పోలీసులకు చిక్కేలా చేసింది. ఝాన్సీలో ఒక వివాహిత మృతి చెందింది. అయితే అది అనుమానాస్పద మృతిగా పోలీసులు తొలుత భావించారు. అయితే మృతురాలి కుమార్తె తన తల్లిని ఎవరు చంపారో బొమ్మను గీసి మరీ మాటలతో కాకుండా గీతలతో చెప్పేసింది. ఆ చిన్నారికి నాలుగేళ్లు మాత్రమే. తన కళ్ల ముందే తన తండ్రి తల్లిని హత్య చేస్తుండటాన్ని చూసిన ఆ చిన్నారి పోలీసులకు డ్రాయింగ్ వేసి మరీ చూపించింది.

తండ్రే చంపారంటూ...
ఝాన్సీలోని కొత్వాలి ప్రాంతంలో ఇరవైఏడేళ్ల సోనాలి బుథోలియా మృతి చెందడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె అత్తమామలు బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే మృతురాలి నాలుగేళ్ల కుమార్తె మాత్రం తన తండ్రి సందీప్ బుధోలియానే తల్లి మరణానికి కారణమని బొమ్మ గీసి మరీ చెప్పింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను కూడా చచ్చిపో అంటూ తన తండ్రి హెచ్చరించారంటూ పోలీసులతో పాటు మీడబియాకు తెలిపింది. అయితే చిన్నారి చేసిన ఆరోపణపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News