ఏడాది క్రితం పెళ్లయింది.. అంతలోనే ఇద్దరి మరణంతో?

భార్య మృతిని తట్టుకోలేని భర్త తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది

Update: 2025-05-25 04:09 GMT

భార్య మృతిని తట్టుకోలేని భర్త తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏడాది క్రితం కామారెడ్డి జిల్లా బిచ్చుందలో సునీల్ తో పెద్ద తడ్కూర్ గ్రామానికిచెందిన జ్యోతితో వివాహమయింది. ఆమె గర్భిణి అని తెలియడంతో ఈ నెల 14వ తేదీన బిచ్కుందలో సీమంతం కూడా నిర్వహించారు. పుట్టింటి నుంచి తీసుకు వచ్చేందుకు భర్త సునీల్ వెళ్లారు ఇద్దరు కలసి ద్విచక్ర వాహనంపైన వస్తుండగా వెనక సీట్లో కూర్చున్నజ్యోతి కింద పడి పోవడంో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

బలవన్మరణానికి పాల్పడి...
అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించారు. దీంతో తన వల్లనే మరణించిందన్న బాధను తట్టుకోలేని సునీల్ బాత్ రూమ్ లోకి వెళ్లి యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్గ్డారు. వెంటనే సునీల్ ను నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకు రాగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. పెళ్లయి ఏడాది గడవకముందే భార్యా భర్తలు మరణించడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.















Tags:    

Similar News