Tamilnadu : తమిళనాడులో పండగ పూట విషాదం.. ముగ్గురు సజీవ దహనం
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు దగ్దమయింది. కారులో ఉన్న ముగ్గురు మరణించారు.
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు దగ్దమయింది. కారులో ఉన్న ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వారు మంటల్లో సజీవ దహనం అయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
కారు దహనం కావడంతో...
కారు దహనం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో దహనమయిన కారును పక్కన పెట్టి పోలీసులు ట్రాపిక్ ను క్రమబద్దీకరించే పనిలో ఉన్నారు. మృతులందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.