చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి
కడప జిల్లాలో విషాదం అలుముకుంది. ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
కడప జిల్లాలో విషాదం అలుముకుంది. ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో ఈతకి దిగిన చిన్నారులు నీటిలో ముగిని మరణించారు. వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన వారు ఎంతసేపూ తిరిగిరాకపోవడంతో సాయంత్రం వరకూ చూసిన తల్లిదండ్రులు తర్వాత వెదుకులాటను ప్రారంభించారు.
వేసవి సెలవులకు...
అయితే బంధువుల ఇళ్లలోనూ లేకపోవడంతో సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి వెతకగా పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో ఐదుగురు చిన్నారులు మరణించినట్లు తెలిసిన కుటుంబసభ్యుల రోదన వర్ణనాతీతంగా ఉంది. గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో వెతికించిన తర్వాత ఐదుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు