తూర్పు గోదావరి జిల్లాలో విషాదం.. గోదారిలో ఎనిమిది మంది యువకుల గల్లంతు
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడి వరం వద్ద గోదావరి నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లలో గోదావరిలో గాలింపు చర్యలను కొనసాగిస్తన్నారు. స్థానికులు కూడా గాలింపులో సహాయ పడుతున్నారు.
గల్లంతయిన వారు...
అయితే గల్లంతయిన ఎనిమిది మంది యువకులు కాకినాడ, రామచంద్రపురం, మండపేట కు చెందిన వారిగా ప్రాధమికంగా గుర్తించారు. ముమ్మిడివరం దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లి యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్ లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో విషాదం నెలకొంది.