Breaking : బాసరలో విషాదం.. గోదావరిలో నలుగురు గల్లంతు

నిర్మల్ జిల్లా బాసరలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు

Update: 2025-06-15 06:58 GMT

నిర్మల్ జిల్లా బాసరలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో బాసర వచ్చిన వారు గోదావరి నదిలో స్నానానికి దిగారు. లోతుగా ఉన్న చోట స్నానినికి దిగడంతో వారు గల్లంతయయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గల్లంతయిన వారంతా హైదరాబాద్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన...
గోదావరి నదిలో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో గోదావరి నదిలో వెదుకులాడుతున్నారు. అయితే మృతులు హైదరాబాద్ కు చెందిన వారని తెలిసినా వారి పేర్లు మాత్రం తెలియలేదు. పోలీసులు అక్కడే ఉండి గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. లోతుగా ఉన్న ప్రాంతానిక వెళ్లడం, ఈత రాకపోవడం వల్లనే గల్లంతయినట్లు తెలిసింది.


Tags:    

Similar News