గుంటూరు జిల్లాలో విషాదం.. షార్ట్ సర్క్యూట్... నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదకాకాని కాళీ రోడ్డులో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు

Update: 2025-02-24 13:00 GMT

గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదకాకాని కాళీ రోడ్డులో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. గోశాల సంపులో పూడిక తీత పనుల్లో విద్యుత్తు షాక్ తగిలి చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పూడిక తీత పనులు కొనసాగుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మరణించారని స్థానికులు తెలిపార.

గోశాలలో పూడిక తీత పనులను...
ఈ ఘటనలో ఒకరైతుతో పాటు ముగ్గురు కూలీలు మరణించారు. విద్యుదాఘాతం వల్లనే మరణించారని పోలీసులు చెప్పారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూడికతీత పనులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.


Tags:    

Similar News