చెరువులో మునిగి నలుగురు మృతి
అన్నమయ్య జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో మునిగి నలుగురు మరణించారు.
అన్నమయ్య జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో మునిగి నలుగురు మరణించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేరుకుంది. స్థానికంగా నివాసముంటున్న మల్లేశ్ తో పాటు ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దుస్తులు ఉతికేందుకు భార్య పెద్దచెరువుకు వెళుతుండగా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు లావణ్య, నందకిశోతో పాటు భర్త మల్లేశ్ కూడా వెళ్లాడు.
దుస్తులు ఉతకడానికి వెళ్లి...
వీరి ఇంటికి ఎదురుగా ఉన్న నందిత కూడా వీరితో పాటు చెరువుకు వెళ్లింది. అక్కడ ఈతను నేర్చుకునేందుకు చెరువులో దిగగా వారు మునిగిపోయారు. పిల్లలంతా మునిగిపోతుండటంతో వారిని రక్షించేందుకు మల్లేశ్ కూడా వెళ్లి అతను కూడా చెరువులో మునిగి మరణించాడు. దీంతో భార్య ఈశ్వరమ్మ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీసేందుకు అప్పటికే జరగరాని ఆలస్యం జరిగింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నాలుగు మృతదేహాలను బయటకు వెలికి తీశారు.