Road Accident : దసరా పండగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
దసరా పండగవేళ ఆంధ్రప్రదేశ్ లో విషాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు
దసరా పండగపూట ఆంధ్రప్రదేశ్ లో విషాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇన్నోవా కారు, బైకు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. అతి వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. దసరా పండగ వేళ ఈ ప్రమాదం జరిగి ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
బైక్ పై వస్తున్న వారిని...
మృతులు పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బైక్ పై వెళుతున్న ముగ్గురిని ఇన్నోవా కారు ఢీకొట్టడంతో వారిలో ఇద్దరు మరణించారు. ఒకరు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.