Murder Case : భర్తను కిరాతకంగా చంపి డ్రమ్ములో వేసి ఉప్పు చల్లిన భార్య
రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య ఉదంతం బయటకు వచ్చింది
రాజస్థాన్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య ఉదంతం బయటకు వచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో బ్లూ డ్రమ్ మర్డర్స్ కలకలం రేపుతుంది. తాజాగా రాజస్థాన్ లో ఖైరథల్ తిజారా జిల్లాలో ఒక ఇంటి మిద్దెపై నీలి డ్రమ్ములో మృతదేహం బయటపడింది. భార్య లక్ష్మీదేవి తన భర్త హన్స్ రామ్ ను చంపి డ్రమ్ లో వేసి ఉప్పు వేసింది. లక్ష్మిదేవికి ఇంటి యజమాని కుమారుడైన జితేంద్ర శర్మ తో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
వివాహేతర సంబంధమే...
అయితే భర్త హన్సీరామ్ ను హత్య చేసిన అనంతరం ప్రియుడు జితేంద్ర శర్మతో కలసి పరారయింది. ఈ నెల 15వ తేదీన హన్సీరామ్ ను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలసి పరారయినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీదేవి, హన్సీరామ్ లకు ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురు పిల్లలున్న తల్లిగా లక్ష్మిదేవి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి అతనిని తొలగించేందుకు ప్లాన్ చేసింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఈ కుటుంబం రాజస్థాన్ లో సెటిలయింది. అక్కడే ఉపాధి వెతుక్కుని హన్సీరామ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
దుర్వాసన రావడంతో...
హన్సీరామ్ స్థానికంగా ఉండే ఇటుకుల బట్టీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే డ్రమ్ములో ఉన్న శవం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి మిద్దెపై ఉన్న బ్లూ డ్రమ్ములో హన్సీరామ్ పదిహేడో తేదీన మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఈ దురాగతానికి లక్ష్మీదేవి పాల్పడిందని భావించి వారికోసం వెదుకులాట ప్రారంభించారు. చివరకు అక్కడే ఉన్న ఇటుకల బట్టీలో లక్ష్మీదేవి, జితేంద్ర శర్మ ఉండటంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.