Tamilnadu : తమిళనాడులో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ లో పడి ముగ్గురు మృతి

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

Update: 2025-10-01 05:37 GMT

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మంగళవారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను తమిళనాడులోని కుంబం ప్రాంతానికి చెందిన జయరామన్, గుడలూరుకు చెందిన సుందర పాండియన్, మైకేల్‌గా పోలీసులు గుర్తించారు.

ట్యాంక్ శుభ్రం చేస్తుండగా...
ఫైర్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టినా, మాన్‌హోల్‌లోకి ప్రవేశించడం సాధ్యంకాకపోవడంతో ఎర్త్‌మూవర్ సహాయంతో శుభ్రం చేశారు. గంటన్నర పాటు కొనసాగిన ఆపరేషన్ అనంతరం కార్మికులను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను కట్టప్పన తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News