జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు

Update: 2025-05-13 07:01 GMT

జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో వీరు హతమయ్యారు. ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారన్న సమాచారం తో ఈరోజు తెల్లవారు జాము నుంచి భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వారిని బంధించే ప్రయత్నం చేశారు.

లష్కరే తోయిబాకు చెందిన...
అయితే ఎదురుకాల్పులకు దిగడంతో భద్రతాదళాలు వారిని మట్టుబెట్టాయి తొలుత కుల్గాం ప్రాంతంలో ప్రారంభమయిన కాల్పులు తర్వాత షోపియాన్ ప్రాంతం వరకూ విస్తరించాయి. ఇద్దరు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతికి చిక్కారు. మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా గ్రూపునకు చెందిన వారిగా గుర్తించారు. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు వెదుకుతున్నాయి.


Tags:    

Similar News