ఒకరిని కాపాడబోయి ఒకరు.. మూడుతరాల బంధం జలసమాధి

నర్సంపేట చిన్న గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(65) అనే రైతుకు ఒక కొడుకు నాగరాజు (34) ఉన్నాడు. కొడుకుకి పెళ్లై 12 ఏళ్ల మనువడు..

Update: 2022-03-13 12:47 GMT

వరంగల్ : విధి ఎప్పుడు ఎవరిని మృత్యురూపంలో మింగేస్తుందో చెప్పలేం. ఒక్కోసారి మనకళ్లముందు జరిగే ఘటనలను కూడా మనం ఊహించలేం. అప్పటివరకూ కళ్లెదుటే తిరిగినవారు.. క్షణాల్లో విగతజీవులుగా మారితే.. ఆ దుఃఖం వర్ణించలేనిది. వరంగల్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదంలో మూడు తరాల బంధం జలసమాధి అయింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఊరు ఊరంతా వారిని చూసి బోరున విలపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట చిన్న గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(65) అనే రైతుకు ఒక కొడుకు నాగరాజు (34) ఉన్నాడు. కొడుకుకి పెళ్లై 12 ఏళ్ల మనువడు దీపక్ ఉన్నాడు. ముగ్గురూ కలిసి సరదాగా గ్రామానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. మనవడు దీపక్ సరదాగా చెరువులో స్నానానికి దిగాడు. లోత గమనించకుండా దీపక్ చెరువులో మునిగిపోవడంతో.. అతడిని కాపాడేందుకు తాత కృష్ణమూర్తి చెరువులోకి దిగాడు. దురదృష్ట వశాత్తు కృష్ణమూర్తి కూడా అందులోనే మునిగిపోయాడు. వారిద్దరూ చెరువులో మునిగి పోతుండడం గమనించిన బాలుడి తండ్రి నాగరాజు కూడా చెరువులోకి దూకాడు. చెరువులో మునిగిపోతున్న తన తండ్రి- కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించిన నాగరాజు కూడా నీట మునిగి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా మూడుతరాల బంధం జలసమాధి అయింది.



Tags:    

Similar News