Road Accident : గుజరాత్ లో ఏపీకి చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.

Update: 2025-09-06 07:19 GMT

గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా, జంగ్వాద్ గ్రామం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం, రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో, విద్యార్థులు ఒక ఎస్‌యూవీ వాహనంలో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.

వాహనం అదుపుతప్పి...
మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులుగుర్తించారు. మితిమీరిన వేగంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. వాహనం అదుపు తప్పడానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పారు. మృతులు నరేశ్ కొడవతి (19), మోతి హర్ష (17), ఆఫ్రిద్ సయ్యద్ (17)గా గుర్తించారు. ఈ వివరాలను అట్‌కోట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌.ఎస్‌. సాకారియా వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News