చిత్తూరులో దొంగలు కాల్పులు.. బీభత్సంతో ఇంట్లో దూరి
చిత్తూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు ఉదయం కాల్పులు జరిపారు
చిత్తూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు ఉదయం కాల్పులు జరిపారు. చిత్తూరు పట్టణంలోని గాంధీరోడ్డులో ఒక భవనంలోకి చొరబడిన దొంగలు ఇంటి వారిని బెదిరించారు. అయితే అందిన సమాచారం మేరకు పోలీసులు ఇంటిని రౌండ్ చేసి లొంగిపోవాలని ఆదేశించారు. ఆ ఇంటి పక్కనే బ్యాంకు ఉండటంతో దాని దోపిడీకి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పది మంది దొంగలు...
మొత్తం పది మంది దొంగలు రివాల్వర్లతో చొరబడి ఇంట్లో సభ్యులను లొంగదీసుకున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం పది మంది దొంగల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ముఠా అన్నది ఇంకా తేలలేదు. అయితే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు జాగ్రత్తగా బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.