Fire Accident : ఢిల్లీలో ఆసుపత్రిలో మంటలు.. ఏడుగురు చిన్నారుల సజీవదహనం

ఢిల్లీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏడుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.

Update: 2024-05-26 05:24 GMT

ఢిల్లీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏడుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అప్పుడే పుట్టిన ఏడుగురు శిశువులు సజీవ దహనం అయ్యారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మరణించడం విషాదం నింపింది

12 మందిని రక్షించి...
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని పన్నెండు మంది చిన్నారులను రక్షించారు. మరికొంతమంది చిన్నారులను ఫైర్ సిబ్బంది వచ్చి రక్షించడంతో మృతుల సంఖ్య భారీగా పెరగకుండా అడ్డుకున్నారు. కొందరు చిన్నారులు గాయపడ్డారని.. వారి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags:    

Similar News