Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం .. 11 మంది స్పాట్ డెడ్

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించారు

Update: 2024-05-26 05:16 GMT

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని షాజహన్‌పుర జిల్లాలో ఖుతర్ వద్ద ఈరోజు తెల్లవారు జామున బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి గాయాలయ్యాయి.

గాయపడిన వారిని...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News