కాలినడకన వెళుతున్న భక్తులపై దూసుకొచ్చిన ట్రక్కు... నలుగురు స్పాట్ డెడ్
తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన వెళుతున్న భక్తులపై ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు
Road accident in gannavaram
తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలినడకన వెళుతున్న భక్తులపై ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకు వచ్చిన ట్రక్కు కాలినడకన వెళుతున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో నలుగరు అక్కడికక్కడే మరణించారు.
ఆలయానికి వెళుతుండగా...
మరియామన్న ఆలయానికి భక్తులు కాలినడకన వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురు భక్తులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన భక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.