Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోబస్సు.. ఎనిమిది మందిస్పాట్ డెడ్

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మరణించారు

Update: 2024-12-27 12:36 GMT

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మరణించారు. పంజాబ్ లోని భటిండా జిల్లా జీవన్ సింగ్ వాల గ్రామ శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. తల్వండీ సాబో నుంచి భటిండా వైపునకు వెళుతున్న ప్రయివేటు బస్సు అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు ఆసుపత్రిలో చనిపోయారు.

అతి వేగమే కారణమని...
వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది గాయపడగా అందులో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వర్షం భారీగా పడుతుండటం, అతివేగమూ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


 


Tags:    

Similar News