Road Accident : కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు.

Update: 2024-05-25 13:39 GMT

కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. కుల్గామ్ నుంచి శ్రీనగర్ కు వెళుతున్న టూరిస్ట్ వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుల్గాం జిల్లాలోని నిపోరా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని పంజాబ్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిలో...
వారిలో కొందరి పరిస్థితి మరింత విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రమాదం సమయంలో టూరిస్ట్ వాహనంలో ఏడుగురు ప్రయాణికులున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో నలుగురు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారు సందీప్ శర్మ, రోమి, జగదీష్, గుర్మీద్ సింగ్ గా గుర్తించారు. అతి వేగం కారణంగానే వాహనం అదుపు తప్పిందంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News