Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. తిరుపతి జిల్లాలోని నగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి - చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. లారీ వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో బస్సులో ఉన్న నలుగురు
రుయా ఆసుపత్రికి తరలించి...
గాయాలయిన వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంతో వచ్చి ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.