Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా గాంగాసాగరం వద్ద ఆగిఉన్న టిప్పర్ ను ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో పదమూడు మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని...
గాయపడిన వారిని వెంటనే పోలీసులు వేలూరులోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి మధురై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పొగమంచు, నిద్రలేమికారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.