ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి

నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. వీరంతా యువ అథ్లెట్లు

Update: 2025-06-01 07:42 GMT

నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు. వీరంతా యువ అథ్లెట్లు. నైజీరియాలో నిన్న రాత్రి జరగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇరవై ఒక్క మంది మరణించారు. వీరంతా యువ అథ్లెట్లు కావడం విశేషం. ఓగున్ రాష్ట్రం నుంచి ఉత్తర నైజీరియాలోని కానోకు తిరిగి వస్తుండగా ఈ ఘోర పర్మాదం జరిగింది.

యువ అథ్లెట్లు మరణించడంతో...
యువ అథ్లెట్లు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అతివేగంతో బస్సును డ్రైవర్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. దీంతో పాటు డ్రైవర్ అలసట కూడా ఒక కారణమని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఇంత మంది అథ్లెట్లు మరణించడం జాతీయ విషాదమని నైజీరియా క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.


Tags:    

Similar News