Uttar Pradesh : యూపీలో కుప్పకూలిన వేదిక.. ఐదుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. లడ్డూ మహోత్సవంలో ఒక వేదిక కుప్పకూలడంతో ఐదుగురు మరణించగా, అరవై మందికి గాయాలయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బాగపత్ లో ఆదినాధుడి నిర్వాణ లడ్డూ ఉత్సవంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేదికను చెక్కతో ఏర్పాటు చేయడంతో వేదికపైకి సామర్థ్యానికి మించి ఎక్కడం వల్లనే వేదిక కుప్పకూలిందని చెబుతున్నారు.
గాయపడిన అరవై మందిని...
ఈ ప్రమాదంలో జైన శిష్యులతో పాటు పోలీసు సిబ్బంది కూడా అరవై మంది వరకూ గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొందరు ఇంకా వేదిక కింద చిక్కుకుని ఉన్నట్లు గమనించి దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఆరా తీశారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.