Big Breaking : ఛత్తీస్ గడ్ లో భారీ పేలుడు.. 17 మంది మృతి

ఛత్తీస్ గడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పదిహేడు మంది మరణించారు

Update: 2024-05-25 05:54 GMT

ఛత్తీస్ గడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. పదిహేడు మంది మరణించారు. గన్ పౌడర్ తయారీ కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. పదుల సంఖ్యలో అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

గన్ పౌడర్ ఫ్యాక్టరీలో...
గన్ పౌడర్ తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ధాటికి పెద్ద సంఖ్యలో మృతి చెందడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటన స్థలం భీతావహంగా తయారయింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News