America : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

తెలంగాణకు చెందిన విద్యార్థి అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన పోలె చంద్రశేఖర్ మరణించారు

Update: 2025-10-04 11:51 GMT

తెలంగాణకు చెందిన విద్యార్థి అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన పోలె చంద్రశేఖర్ మరణించారు. చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈరోజు తెల్లవారు జామున డల్లాస్ లో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మరణించాడు.

పెట్రోల్ బంకులో పనిచేస్తూ...
చంద్రశేఖర్ ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. కాల్పులు జరపడానికి కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే డబ్బుల కోసం దుండగుడు కాల్పులు జరిపాడా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న దానిపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని వీలయినంత త్వరగా భారత్ కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులను కోరుతున్నారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.


Tags:    

Similar News