కడప జిల్లాలో విద్యార్థిని మృతికి అదే కారణమా?

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది

Update: 2025-07-15 06:24 GMT

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గండికోటలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొద్దుటూరులో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని నిన్న కళాశాలకు వెళ్లి ఇంటికి రాలేదని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు.

మరో యువకుడితో...
మృతి చెందిన విద్యార్థిని ఎర్రగుంట్ల మండలం హనుమాన్‍గుత్తికి చెందిన యువతిగా పోలీసుల గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎవరైనా హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. మరో యువకుడితో విద్యార్థిని గండికోటకు వచ్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా కూడా విచారిస్తున్నారు.


Tags:    

Similar News