చోరీకి గురైన నగదు చెత్త బండిలో.. కరెన్సీ కట్టలు చూసి?

చెత్త బండిలో చోరీకి గురైన నగదు దొరికింది. ఎనభై ఆరు వేల రూపాయల నగదు రైతు రామకృష్ణకు దొరికింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది

Update: 2025-06-09 05:30 GMT

డబ్బు కష్టపడి సంపాదించింది అయితే ఎక్కడికి పోదు. అది చివరకు మనకు చేరుతుంది. ఎందుకంటే మన కష్టాన్ని నమ్ముకుని ఎవరినీ మోసం చేయకపోతే ఆ కరెన్సీ కూడా వేరే వాళ్ల దగ్గర ఉండేందుకు ఇష్టపడదు. ఇందుకు ఉదాహరణగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనే. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లికి చెందిన రామకృష్ణ రైతు. ఇటీవల తన బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో ఎనభై వేల రూపాయల బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకున్నాడు. ఆ నగదును బైక్ ముందు కవర్‌లో పెట్టుకుని వెళ్తూ మధ్యలో భోజనం కోసం రామకృష్ణ ఆగాడు. ఈ సమయంలో ఓ వ్యక్తి అతడిని అనుసరించి వాహనంలో ఉన్న డబ్బును దొంగిలించాడు. రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడు శ్రీనివాసపురం వీధిలోకి వెళ్లినట్లు గుర్తించారు. ముందు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించి.. ఆ తర్వాత నిందితుడు అతను కాదని నిర్ధారించుకుని వదిలేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

చెత్త వేస్తుండగా...
అయితే ఈ నెల ఆరో తేదీన శ్రీనివాసపురం ప్రాంతంలో పంచాయతీ చెత్త సేకరణ బండి వెళ్లింది. చెత్త వేస్తున్న రాయదుర్గం సురేష్ అనే వ్యక్తి పాలిథిన్ కవర్‌లో కరెన్సీ నోట్ల కట్టలు ఉండటం గుర్తించాడు. తీసుకుని తెరిచి చూస్తే అందులో ఎనభై ఆరు వేల రూపాయల నగదుతో పాటు, బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు ఉన్నాయి. సురేష్ వెంటనే ఆ నగదును, పాస్‌బుక్, పాన్‌కార్డును స్థానిక ఎస్సై హనీఫ్‌కు అప్పగించాడు. ఎస్సై హనీఫ్ సురేష్ నిజాయితీని ప్రశంసించి వెయ్యి రూపాయలను బహుమతిగా ఇచ్చారు. పాస్‌బుక్ ఆధారంగా డబ్బు రామకృష్ణదేనని నిర్ధారించి పోలీసలుు అతనికి అప్పగించారు. చోరీకి గురైన నగదు తిరిగి తనకు చేరడంతో రైతు రామకృష్ణ ఊపిరి పిల్చుకున్నాడు. అందుకే కష్టపడి, నిజాయితీగా పనిచేసిన వారి సొమ్ము ఎక్కడికీ పోదని ఈ ఘటన ద్వారా మరొకసారి తేలిందని రామకృష్ణ సన్నిహితులు, కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News