రిమాండ్ లో నటుడు శ్రీరామ్

డ్రగ్స్ కేసులో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ అరెస్ట్ అయ్యారు.

Update: 2025-06-24 09:32 GMT

డ్రగ్స్ కేసులో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ అరెస్ట్ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత ప్రసాద్‌తో సంబంధాలున్న ఈ డ్రగ్స్ రాకెట్‌లో శ్రీరామ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు శ్రీరామ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించాక నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణ అనంతరం శ్రీరామ్‌ను చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం శ్రీరామ్‌కు జులై 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

Tags:    

Similar News